2 April, 2026 | 5:23 PM

అంగన్వాడీ కేంద్రంలో అక్షరబ్యాసం

02-04-2026 04:02 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని బక్కమంతుల గూడెం సెక్టార్ పరిధిలో అల్లీపురం గ్రామ పంచాయతీ అంగన్వాడీ స్కూల్ లో అక్షరాభ్యాసం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్లీపురం సర్పంచ్ భోగాల జ్యోతి పిచ్చిరెడ్డి హాజరయ్యారు.అనంతరం వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మల్ రెడ్డి వీరారెడ్డి,కార్యదర్శి నరేందర్ రెడ్డి, వీరారెడ్డి,అంగన్వాడీ టీచర్ మంజుల, ఎఎన్ఎమ్ రాధిక, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.