11-05-2025 05:13:27 PM
గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం హనుమాన్ శోభాయాత్ర గురుస్వామి మెరుగు మల్లయ్య స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి హనుమాన్ దీక్ష దారులు కాషాయ వర్ణ పతాకాన్ని చేబుని శోభాయాత్రలో పాల్గొన్నారు. దీనితో గూడూరు మండల కేంద్రం కాషాయవరణ శోభితంగా మారింది.
ఈ కార్యక్రమంలో గురు స్వాములు బల్సుకురి సంపత్, మడి పెద్ది శ్రీనివాస్, దేశ్ సురేష్, మెరుగు మధుకర్, వెంకన్న, ఆయిలి వెంకటేశ్వర్లు, వినుముల దేవేందర్, భూక్య రవి, రవి సింగ్ రాథోడ్, నాంచారి వినయ్, పిట్టల మనోజ్, కోరే అనిల్, దయ్యాల ఉపేందర్, నాగ స్వామి, అఖిల్, రమణ, బత్తిని శంకర్, మేరెడ్డి చంద్రశేఖర్, పింగిలి హైందవ్, మెరుగు భరత్ శ్రీనివాస్, గడిల నాగరాజు, ఆంజనేయస్వామి మాలాధారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.