మనశ్శాంతితోనే సంతోషం
సంగారెడ్డి చర్చి ఉత్సవాల్లో పాల్గొన్న జగ్గారెడ్డి
సంగారెడ్డి, డిసెంబర్ 14 :డబ్బులుంటేనే సంతోషం ఉండదని, మనశ్శాంతిగా ఉన్నప్పుడే సంతోషం కలుగుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. ఆదివారం సంగారెడ్డిలోని సిఎస్‌ఐ చర్చిలో నిర్వహిస్తున్న ప్రాంతీయ జాతర మహోత్సవంలో ఆయన పాల్గొని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ మీకు అందుబాటులో ఉన్నా లేకున్నా...మీ పనులు పూర్తి చేస్తునే ఉంటానన్నారు.
ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులతో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. ఈ మహోత్సవాలకు సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ పలు ప్రాంతాల నుండి వందలాదిగా హాజరైన క్రైస్తవులు హాజరవుతారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏసుక్రీస్తును స్మరిస్తూ యువతీ, యువకులు పాటలు పాడారు. నెలరోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు హాజరవుతారు. ఈ కార్యక్రమంలో మెదక్ బిషప్తో పాటు ఆయా చర్చిల ఫాదర్లు, కాపరులు పాల్గొన్నారు.






