calender_icon.png 16 December, 2025 | 11:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ మద్యం పట్టివేత..కేసు నమోదు

15-12-2025 12:12:30 AM

వనపర్తి, డిసెంబర్ 14 ( విజయక్రాంతి ) : వనపర్తి జిల్లా వీపన గండ్ల మండల పరిధిలోని ఓ గ్రామానికి అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. స్థానిక ఎస్‌ఐ కె. రాణి కథనం ప్రకారం, మండల పరిధిలోని వల్లభాపురం తండాకు చెందిన ఓ వ్యక్తి సుమారు 40 లీటర్ల మద్యం అక్రమంగా తరలిస్తుండగా.. సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు శనివారం రాత్రి 11 గంటల సమయంలో దాడి చేసి అతడిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు. అక్రమ మద్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు