13న తిరంగా ర్యాలీ
నిర్మల్,(విజయక్రాంతి): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హర్ ఘర్ తిరంగా ర్యాలీ 13 నిర్వహిస్తున్నట్టు జోనల్ కన్వీనర్ రావుల రామనాథ్ తెలిపారు. సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నివాసంలో సమావేశం ర్యాలీ విజయవంతంపై చర్చించారు. మాట్లాడుతూ.. కేంద్రంలో వేలాది మంది కార్యకర్తలతో భారీ తిరంగా ర్యాలీ విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు.
ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటిపై కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ జెండాను ఎగరవేయాలని, అలాగే ప్రతి ఒక్కరూ తమ వాట్సాప్ డీపీలు, సామాజిక మాధ్యమాల ప్రొఫైల్ చిత్రాలుగా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు సుంకరి సాయి, పట్టణ కౌన్సిలర్లు గంజి రాజు, జింక సూరి , శ్రీరామోజు నరేష్, సూరజ్ నాయక్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నిరంజన్ రెడ్డి, నాయకులు సాత్విక్, అర్జున్, భరత్, విజయ్, దీక్షిత్, చరణ్ తదితరులు పాల్గొన్నారు






