కూకట్‌పల్లిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ
కూకట్‌పల్లి, ఆగస్టు 14 (విజయక్రాంతి): నియోజకవర్గ పరిధిలోని కెపిహెచ్బి కాలనీ, ప్రశాంత్ నగర్ లలో బిజెపి నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించారు. 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నిర్వహించిన ఈ ర్యాలీకి రాష్ట్ర బిజెపి నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు.
ప్రశాంత్ నగర్ డివిజన్ లో మేడ్చల్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి యంజాల పద్మయ్య ఆధ్వర్యంలో, కేపిహెచ్ బి కాలనీ డివిజన్ లో ప్రీతం రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో బిజెపి నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాను చేత భూని భక్తి నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు.
150 మీటర్ల భారీ జాతీయ పతాకంతో నిర్వహించిన ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కెనడి పాఠశాల విద్యార్థులు, ఫ్రెండ్ రేట్ హై స్కూల్ విద్యార్థులు ర్యాలీలో పాల్గొని దేశభక్తి గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఇంచార్జి మాధవరం కాంతారావు, శ్రీరామ్ జగ్గారావు, వెంకట్ రెడ్డి, ఈశ్వర్ రావు, సింహాద్రి ప్రసాద్, విజయరాజు, పాఠశాల ల ఉపాధ్యాయులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.






