15 August, 2026 | 1:49 AM

ఎంపీ డీకే అరుణ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరిక

15-08-2026 12:00 AM

మూసాపేట్ ఆగస్టు 14 : మూసాపేట్ మండల పరిధిలోని కొమిరెడ్డిపల్లి బీఆర్‌ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ రాఘవేందర్ శుక్రవారం పాలమూరు ఎంపీ డీకే అరుణ సమక్షంలో మూసాపేట్  మండల అధ్యక్షులు  టీకే నరసింహ  ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరారు. బిజెపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీజేపీ చేస్తున్న అభివృద్ధి, సేవా కార్యక్రమాలను చూసి ఆకర్షితుడినై  బిజెపిలో చేరుతున్నానని రాఘవేందర్  తెలిపారు.