13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ఐపీఎల్ మరో స్థాయికి చేరింది

28-03-2026 01:43 AM

ఎన్‌బీఏతో సమానంగా నిలిచిందన్న దాదా

జాక్సన్ గ్రూప్ అంబాసిడర్‌గా గంగూలీ

న్యూఢిల్లీ, మార్చి 27 : దేశంలో ఇంధన, మౌలిక రంగంలో ప్రముఖ సంస్థగా ఉన్న జాక్సన్ గ్రూప్ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. భారత్‌లో భవిష్య త్ ఆధారిత ఆవిష్కరణలు ప్రోత్సహించడమే లక్ష్యంగా గంగూలీతో పలు క్యాంపెయిన్‌ల ను రన్ చేయనుంది. ఈ సందర్భంగా ఐపీఎల్ బ్రాండ్ వాల్యూపై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ భారత్ క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌కు నిదరన్శనమన్నాడు.

ఐపీఎల్ మరో స్థాయికి చేరిందని, ఎన్‌బీఏతో సమానంగా నిలవడం చూస్తే గ ర్వంగా ఉందన్నాడు. జాక్సన్ గ్రూప్‌తో భాగస్వామ్యంపై సంతోషం వ్యక్తం చేశాడు. సోలా ర్ ఎనర్జీ, గ్రీన్ మాలిక్యూల్స్ వంటి వాల్యూ చైన్‌పై దృష్టి సారించిన జాక్స న్ గ్రూప్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చె ప్పాడు. దాదా నాయకత్వం భారత క్రికెట్‌లో ఎలాంటి ఫలితాలను ఇచ్చిందో చూసామని, ఇప్పుడు తమ బ్రాండ్ క్యాంపెయిన్‌కు కూ డా ఆయన సారథ్యం గొప్ప స్థాయికి తీసుకెళ్తుందని నమ్ముతున్న ట్టు జాక్సన్ గ్రూప్ ఛైర్మన్ సమీర్ గుప్తా చెప్పారు.