16 July, 2026 | 8:40 AM

హార్దిక్ పాండ్యాకు జరిమానా..

20-04-2024 12:45 AM

ముల్లాన్‌పూర్: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జరిమానాకు గురయ్యాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గాను పాండ్యాకు ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి కింద రూ. 12 లక్షల జరిమానా విధించినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. నిర్ణీత సమయంలోగా 20 ఓవర్లు పూర్తి చేయడంలో విఫలం కావడంతో చివరి రెండు ఓవర్లలో ముంబై సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లతోనే ఆడాల్సి వచ్చింది. ఈ సీజన్‌లో ఇదే తొలిసారి కావడంతో పాండ్యాకు జరిమానాతో సరిపెటినట్లు బోర్డు వెల్లడించింది. ఈ సీజన్‌లో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ రెండుసార్లు, గుజరాత్ కెప్టెన్ గిల్, రాజస్థాన్ కెప్టెన్ శాంసన్ స్లో ఓవర్ రేట్ బారిన పడ్డారు. ఇక మ్యాచ్‌లో ముంబై 9 పరుగుల తేడాతో పంజాబ్‌పై థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది.