‘ముంబై చీటింగ్’ వివాదం
ముల్లాన్‌పూర్: పంజాబ్‌తో మ్యాచ్‌లో ముంబై ఇన్నింగ్స్ సందర్భంగా ఆ జట్టు ఆటగాడు టిమ్ డేవిడ్ డగౌట్ నుంచి.. సూర్యను డీఆర్‌ఎస్‌కు వెళ్లాలంటూ సైగలు చేయడం వైరల్‌గా మారింది. రివ్యూ విషయంలో ముంబై చీటింగ్ చేసిందంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అర్ష్‌దీప్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో సూర్యకుమార్ ఆడిన ఐదో బంతి క్రీజుకు దూరంగా వెళ్లింది. ఫీల్డ్ అంపైర్ ఎలాంటి సిగ్నల్ ఇవ్వలేదు. కానీ డగౌట్‌లో ఉన్న టిమ్ డేవిడ్ వైడ్ సిగ్నల్ కోసం డీఆర్‌ఎస్ అడగాలంటూ చేతులతో సైగలు చేశాడు. ఇది గమనించిన పంజాబ్ కెప్టెన్ సామ్ కరన్ అంపైర్ దృష్టికి తీసుకొచ్చాడు. ఇది పట్టించుకోని ఫీల్డ్ అంపైర్ డీఆర్‌ఎస్‌కు రిఫర్ చేయడం గమనార్హం. ఈ ఘటనపై ఐపీఎల్ యాజమాన్యం నుంచి స్పందన రాలేదు. కానీ అంపైరింగ్ వ్యవస్థపై మాత్రం సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.






