calender_icon.png 20 December, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఔదార్యాన్ని చాటిన హరీశ్‌రావు

20-12-2025 01:38:14 AM

  1. నాడు ఆటో కార్మికుల కోసం... నేడు నిరుపేద విద్యార్థిని చదువు కోసం ఆపన్నహస్తం
  2. ఇంటిని తనఖా పెట్టి మరీ రూ. 20 లక్షల ఎడ్యూకేషన్ లోన్ మంజూరు 
  3. హాస్టల్ ఫీజు లక్ష రూపాయలు ఇచ్చిన మాజీమంత్రి

హైదరాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి) : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మరోసారి ఔదార్యాన్ని చాటిచెప్పారు. తాజాగా ఓ నిరుపేద వైద్యవిద్యార్థిని భవిష్యత్తుకు చేయూత అందించారు. ఆ విద్యార్థినికి బ్యాంకు రుణం దక్కడానికి ఏకం గా తన సొంత ఇంటినే తనఖా పెట్టి పెద్దమనసు చాటుకున్నారు. సిద్దిపేటకు చెందిన కొంక రామచంద్రం టైలరింగ్ వృత్తి చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

ఆయన పెద్ద కుమార్తె మమత విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఉచితంగా ఎంబీబీఎస్ సీటు సాధించి చదువు పూర్తి చేసింది. పీజీ ఎంట్రెన్స్ పరీక్ష రాయగా మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో ఆప్తమాలజీ విభాగంలో పీజీ సీటు వచ్చింది.  ఆర్థిక స్థోమత లేని రామచంద్రం కూతురు చదువుకు అయ్యే ఖర్చు పెట్టలేక కుమిలిపోయాడు.

విషయాన్ని హరీశ్‌రావుకు తెలుపారు. వెంటనే హరీశ్‌రావు  సిద్దిపేటలోని తన ఇంటిని మార్టిగేజ్ చేసి మూడేళ్లకు సరిపడా దాదాపు రూ. 20 లక్షల రూపాయల ఎడ్యుకేషన్ లోను మంజూరు చేయించారు. దీంతో ఆ డబ్బులను కళాశాలలో చెల్లించి సీటు దక్కించుకున్నారు. అంతే కాకుండా మొదటి సంవత్సరం హాస్టల్‌కు లక్ష రూపాయలు కూడా హరీశ్ రావు చెల్లిం చి దాతృత్వం ప్రదర్శించారు. 

నాడు ఆటో కార్మికులకు, నేడు పేద విద్యార్థినికి..

సిద్దిపేట నియోజకవర్గంలోని ఆటో కార్మికుల సంక్షేమానికి మూడేళ్ల క్రితం తన ఇంటి ని మార్టిగేజ్ చేసి బ్యాంకు ద్వారా రుణం ఇప్పించారు. ఆ ఫలితంగానే సిద్దిపేట ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు కావడమే గాకుండా వందలాది మంది  కార్మికులకు కొండంత భరోసాగా నిలిచింది. ఆయన చేసిన సహాయం వందలాదిమంది ఆటో కార్మికుల జీవితాల్లో వెలుగులు  నేడు నిరుపేద విద్యార్థిని మమత వైద్యవిద్య విష యం తన దృష్టికి వచ్చింది.  వెంటనే  ఆ అ మ్మాయికి బ్యాంకు రుణం అందడానికి తన స్వగృహాన్ని మరోసారి మార్టిగేజ్ చేయడానికి కూడా వెనుకాడలేదు.  

పీజీ సీటు పోతుందని బాధపడ్డా 

మా అమ్మానాన్నలు కష్టపడి టైలరింగ్ చేస్తూ నన్ను ఎంబీబీఎస్ దాకా చదివించా రు. అహర్నిశలు శ్రమించి పీజీ ఎంట్రన్స్‌లో సీటు దక్కిందని సంతోష పడ్డాను. ఉచితంగానే సీటు వచ్చినా కానీ ప్రతి సంవత్సరం ట్యూషన్ ఫీజు రూ.7.50 లక్షల చొప్పున మూడేళ్లు రూ.22.50 లక్షలు కట్టాలని చెప్పడంతో ఇక సీటు అసాధ్యమని అనుకున్నా. కానీ అనాడు నాతో పాటు మా చెల్లెళ్లకు ఎం బీబీఎస్ చదవడానికి హరీష్ రావు సార్ హెల్ప్ చేశారు. కానీ ఇది పెద్ద విషయం కావడంతో సార్ చేస్తారో..లేదో అని టెన్షన్ పడ్డా ము. మేము అడగడమే ఆలస్యం.. తన ఇంటిని బ్యాంకులో మార్టిగేజ్ చేసి ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తానని బ్యాంకు వారికి కూ డా ఫోన్ చేసి చెప్పారు.  

 మమత, వైద్య విద్యార్థిని

హరీషన్నది తీర్చుకోలేని రుణం 

నా బిడ్డ కష్టపడి చదివి ప్రభుత్వ కన్వీనర్ కోటాలో సీటు సంపాదించినప్పటికీ ఆర్థిక స్థోమత లేక ట్యూషన్ ఫీజు కూడా చెల్లించే పరిస్థితి లేదు. మేం చేసిన ప్రయత్నాలకు అన్ని దారులు మూసుకుపోయాయి. కానీ ఆపద వచ్చినవారి కోసం నిరంతరం తన ఇంటి తలుపులు తెరిచి ఉంచే హరీష్ అన్న ఏకంగా తన ఇంటిని మాకోసం తాకట్టు పెడతాడని కలలో కూడా ఊహించలేదు. నా నలుగురు బిడ్డలు హరీష్ అన్న స్ఫూర్తితోనే, ఆయన చేసిన సహాయంతోనే ఎంబీబీఎస్ వైద్య విద్య చదువుతున్నారు. అన్న రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము.

 కొంక రామచంద్రం, విద్యార్థిని మమత తండ్రి