calender_icon.png 20 December, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభిమానాన్ని చాటుకున్న బీఆర్‌ఎస్ వీరాభిమాని

20-12-2025 01:37:16 AM

జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), డిసెంబర్19: ఇటీవల జరిగిన మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో జాజిరెడ్డిగూడెం మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి నున్న యాదగిరి తన సమీప ప్రత్యర్థిపై 78ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. దీంతో గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ వీరాభిమాని నున్న మహేష్ యాదవ్ పార్టీపై ఉన్న అభిమానం, తన అన్న గెలవాలని కోరుతూ స్వామివారికి మొక్కుకున్నారు.

శుక్రవారం జిల్లా కేంద్రం సూర్యాపేట సమీపంలోని దురాజ్ పల్లి వద్దగల లింగమంతుల స్వామి(పెద్దగట్టు) దేవాలయంలో తన తలనీలాలను స్వామివారికి సమర్పించి తమ అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మాండ్ర గోవర్ధన్, గ్రామశాఖ అధ్యక్షుడు తొడుసు వీరమల్లు నాయకులు నున్న సురేష్, వల్లపు శ్రీనివాస్, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.