జీ7 సమ్మిట్ కు తొలిసారిగా పోప్.. మోదీ ఆత్మీయ ఆలింగనం
14-06-2024 08:47 PM
ఇటలీలో జరుతున్న జీ 7 సమ్మిట్ కు అగ్ర నేతలంతా హాజరయ్యారు. దీంతో ఆయా దేశాధినేతలతో ఒకరినొకరు పలకరించుకుంటూ ఆత్మీయ ఆలింగనం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే జీ7 సమ్మిట్ లో భాగంగా అవుట్ రీచ్ సెషన్ లో వాటికన్ సిటీ పోప్ ఫ్రాన్సిస్ హాజరయ్యారు. సదస్సును ఉద్దేశించి ఆయన జీ7 సమ్మిట్ లో తొలిసారి ప్రసంగించనున్నారు. సదస్సుకు వచ్చిన దేశాధ్యక్షులు, ప్రధానులకు పోప్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మీయ ఆలింగనం చేసుకొని కొద్దిసేపు ముచ్చటించారు. అంతే కాకుండా బ్రిటీష్ ప్రధాని రిషి సునక్ తో కూడా ప్రధాని మోదీ సంభాషించారు. కాగా పోప్ ఫ్రాన్సిస్ జీ7 సమ్మిట్ కు రావడం ఇదే తొలిసారి.






