calender_icon.png 10 September, 2025 | 3:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలేజీ సమయానికి బస్సులు నడపాలని ధర్నా

05-09-2025 12:00:00 AM

మేడ్చల్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): కాలేజీ సమయానికి బస్సులు నడపాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మేడ్చల్ బస్సు డిపో ఎదుట విద్యార్థులు ధర్నా చేశారు. బస్సులు ఆలస్యంగా రావడం వల్ల క్లాసులకు హాజరు కాలేకపోతున్నామని వారు తెలిపారు.

అంతేగాక పెంచిన బస్ పాస్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. డిపో మేనేజర్ సుధాకర్ విద్యార్థుల వద్దకు వచ్చి మాట్లాడారు. సమయానికి బస్సులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు భగత్, శ్యామ్, కరుణాకర్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.