అబద్ధాలకు ప్రతీక హరీశ్‌రావు
- తుపాకీ మాటలు, పేలని హామీల పార్టీ బీఆర్‌ఎస్
- టీపీసీసీ ఫిషర్మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయికుమార్
హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అసెంబీలోనూ, పార్టీ కార్యాలయంలోనూ అస త్యాలు మాట్లాడుతున్నారని టీపీసీసీ ఫిషర్‌మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ విమర్శించారు. హరీష్‌రావు అబద్ధాలకు ప్రతీకగా మారారని, ఆయన తన నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. హరీష్ రావు మాట్లాడుతున్న వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ నాయకులే నమ్మే పరిస్థితి లేదని, వాటిని విని వారే నవ్వుకుంటున్నారని మెట్టుసాయి ఎద్దేవా చేశారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ తుపాకీ మాటలు, పేలని హామీలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించిన చరిత్ర బీఆర్‌ఎస్‌దేనని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయా న్ని రూ.38 వేల కోట్ల నుంచి లక్ష కోట్లకు పెంచింది ఎవరో? తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టు అంచనాలను పెంచారని, ఈ అంశంపై కేసీఆర్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. 2028 ఎన్నికలు కల్వకుంట్ల కుటుంబానికి చివరి ఎన్నికలవుతా యని, సిద్ధిపేటలో హరీష్‌రావు ఓడిపోవడం ఖాయమన్నారు. ప్రజలు బీఆర్‌ఎస్‌ను మరిచారని, పదేళ్ల పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి 30 నెలల పాలనలో 70వేల ఉద్యోగాలు కల్పించారని మెట్టు స్పష్టం చేశారు.






