రాగం సుజాత మృతికి హరీశ్‌రావు నివాళి
శేరిలింగంపల్లి, ఆగస్టు 19 (విజయక్రాంతి): తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్పర్సన్, ప్రముఖ సామాజిక కార్యకర్త రాగం సుజాత యాదవ్ మరణం పట్ల మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సంతాపం తెలిపారు. బుధవారం నల్లగండ్లలోని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.
సుజాత యాదవ్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, మహిళా సాధికారత కోసం చేసిన కృషిని హరీష్‌రావు గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఆమె పాల్గొన్న సభలు, ర్యాలీల దృశ్యాలను టీవీలో చూసిన తర్వాత ఆమె తెలంగాణ బిడ్డగా చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఆమె సేవలు చిరస్మరణీయమని అన్నారు. సామాజిక రంగానికి ఆమె మరణం తీరని లోటని వ్యాఖ్యానించారు. భగవంతుడు ఆమె ఆత్మకు శాంతి ప్రసాదించాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, బీఆర్‌ఎస్ అసెంబ్లీ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి, పలువురు మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.






