20 August, 2026 | 1:46 AM

ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టాలి

20-08-2026 12:09 AM

ఎంపీడీవో ప్రవీణ్ కుమార్

శంకర్‌పల్లి, ఆగస్టు 19 (విజయక్రాంతి): కురిసే ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి భూగ ర్భ భూగర్భ భూగర్భజలాలకు నీటి భద్రత కల్పించేందుకే తెలంగాణ ప్రభుత్వం జలసిరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని శంకర్ పల్లి ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, డి ఎల్ పి ఓ సతీష్ కుమారులు పేర్కొన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్ అసిస్టెంట్లతో వారాంతపు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తప్పనిసరిగా జలసిరి పథకంలో భాగంగా రెండు ఫామ్ పాంట్స్ నిర్మించాలని తెలిపా రు. కమ్యూనిటీ సోఫిట్ లు, వ్యక్తిగత ఇంకు డుగుంతలు, బోర్వెల్ రీఛార్జ్ పాయింట్లు ని ర్మించాలని సూచించారు. ప్రతి గ్రామపంచాయతీలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అప్లి కేషన్ ఫామ్ తీసుకోవాలని ఆదేశించారు.

పెన్షన్ల విషయంలో ఎటువంటి పొరపాట్లు కానీ, నిర్లక్ష్యం కానీ జరగకుండా అర్హులకు మా త్రమే అందే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా కార్యదర్శులు ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రణాళిక బద్ధంగా జరిగే విధంగా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గిరిరాజు, ఏపీవో నా గభూషణం, పంచాయతీ కార్యదర్శులు, టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.