calender_icon.png 22 July, 2025 | 6:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి

22-07-2025 12:53:50 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని కోరుతూ మంగళవారం జాతీయ మానవ హక్కుల కమిటీ(National Human Rights Committee) జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ సభ్యులతో కలిసి జిల్లా అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారి , డేవిడ్ లకు వినతి పత్రం అందజేశారు. ఎన్ హెచ్ఆర్సి జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ మాట్లాడుతూ జిల్లాలోని అనేక మంది రైతులు బయట వ్యక్తుల నుంచి వడ్డీతో అప్పులు తీసుకొచ్చి బ్యాంకులకు పంట రుణాలు చెల్లించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు రెండు లక్షల షరతులు లేని రుణమాఫీ వర్తింపజేసి ఆదుకోవాలని కోరారు.