23 March, 2026 | 5:13 PM

Breaking News

మాగంటి గోపీనాథ్‌ కుటుంబంలో మరో విషాదం   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్   •   పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి   •   రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్.. అంకెల గారడి బడ్జెట్   •   ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించండి   •   కార్లు, ఇళ్లు చూపించి ఆకర్షిస్తున్నారు.. క్యూనెట్ కేసులో కీలక వ్యక్తులు అరెస్ట్   •   ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు తక్షణమే పరిష్కరించాలి   •   ఆనందోత్సాహాలతో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం   •   అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి ఆర్థిక సహాయం   •   విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు రూ. కోటి ప్రమాదబీమా చెక్కులు పంపిణీ   •  

రాజీవ్ యువవికాసం ఎప్పుడు అమలు చేస్తారు?

23-03-2026 04:03 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం 1.65 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని మాజీ హరీశ్ రావు(Former Minister Harish Rao) వెల్లడించారు. తాము పెట్టిన బడ్జెట్ ఆధారంగానే ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు. రాజీవ్ యువవికాసం ఎప్పుడు అమలు చేస్తారో ప్రభుత్వం చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. మహిళా సంఘాలకు రూ. లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు ఇస్తామని రెండు బడ్జెట్ లలో చెప్పారు. మూడోబడ్జెట్ కు వచ్చేసరికి వడ్డీ లేని అనే పదం తీసేసి.. రుణాలు మాత్రమే అని పెట్టారని సూచించారు.

18 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి రెండున్నరేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆదాయం ఎందుకు తగ్గుతుందో చెప్పాలని కోరారు. హైడ్రా, విధ్వంసక ఆలోచన వల్ల ఆదాయం తగ్గుతోందని తెలిపారు.  బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎన్నిక ఉద్యోగాలు ఇచ్చారో.. చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. నోటిఫికేషన్లు ఇచ్చినంత మాత్రానా వారికి జీతాలు అందాయా? అని సీతక్క ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉండి.. ఒక్కసారి కూడా రుణమాఫీ పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వమే పరీక్షలు జరిపి, నియామకపత్రాలు ఇచ్చిందని సీతక్క స్పష్టం చేశారు.