calender_icon.png 21 November, 2025 | 2:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరీశ్ రావు ప్రజలలో విశ్వాసం కోల్పోవద్దు.. రాజీనామా చేయండి

16-08-2024 03:23:49 PM

సిద్ధిపేట, (విజయక్రాంతి): రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానాన్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వెంటనే రాజీనామా చేయాలని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తూ ఇమామ్ అన్నారు. ఆగస్టు 15 లోపు రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫి అమలు చేశారని అన్నారు. సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా చేయకుంటే ప్రజలలో మీరు మరింత విశ్వాసం కోల్పోతారని విమర్శించారు. ఇప్పటికే ప్రజలు మీరు చేసిన ఘనకార్యాలను చూసి అధికారంలోనికి నుంచి దింపి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని ఆ అర్హత కూడా మీరు కోల్పోవద్దని ఎద్దేవా చేశారు.

రైతులపై నిజమైన ప్రేమ బిఆర్ఎస్ కు ఉంటే బిఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు రాజీనామా చేసేలా ఒత్తిడి తేవాలని అన్నారు. బిఆర్ఎస్ నాయకుల మాటలు వింటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. మీరు ఎన్ని నాటకాలు చేసిన ప్రజలు మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరన్నారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నదని అన్నారు. ఇకనైనా బిఆర్ఎస్ నాయకులు బుద్ధి తెచ్చుకొని ఆలోచించి మాట్లాడాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి గ్యదారి మధు. యువజన పట్టణ అధ్యక్షులు గయాజుద్దీన్, ఎన్ ఎస్ యు ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ రాశాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సందీప్ యాదవ్,  నజ్జూ, అజయ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు