calender_icon.png 21 November, 2025 | 1:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి సాగుపై తండాల్లో తనిఖీలు.. సాగు చేస్తే కఠిన చర్యలు

16-08-2024 03:02:50 PM

కామారెడ్డి (విజయక్రాంతి): గంజాయి నిర్మూలనలో భాగంగా జిల్లా ఎస్పీ  ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డీఎస్పి శ్రీనివాసులు ఆధ్వర్యంలో శుక్రవారం గాంధారి మండలంలోని నేరేల్  తండా, చద్మల్ తండ, బీర్మల్ తండ, కొత్త బాది తండా, గుజ్జుల్ తండా, సోమారం తండా, గొల్లాడి తండాల లో గల పంట పొలాలలో మరియు అడవి భూములలో దాదాపు 100 మంది సిబ్బందితో తనిఖీలు చేయడం జరిగిందని .ఎవరైనా గంజాయి పండించిన, రవాణా చేసిన ఎవరి దగ్గరైనా ఉన్నా గాని పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వగలరని, డీఎస్పీ శ్రీనివాసులు  తెలిపినారు. ఈ తనిఖీల్లో సదాశివనగర్ సిఐ  సంతోష్, ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్, గాంధారి ఎస్సై ఆంజనేయులు, సదాశివ నగర్ ఎస్సై రంజిత్, జిల్లాలోని పలువురు ఎస్సైలు, ఆబ్కారి శాఖకు చెందిన సీఐ షాకీర్, ఎస్సై గంగాధర్, సిబ్బంది పాల్గొన్నారు.