16-08-2024 03:28:56 PM
యాదాద్రి భువనగిరి: శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి దేవస్థానంలో మూడు రోజులుగా పవిత్రోత్సవాలు కోనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నిత్య కైంకర్యముల అనంతరం నవకలశ స్నపనం అళహ సింగర్ (ఉత్సవ మూర్తులకు) వైభవముగా జరిగింది.
యాగశాలలో చతుస్థానార్చనలు, మహా కుంభ ఆరాధనలు, మండలరాధన, విశేష హోమములు పూర్తి కాగానే మహా పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. శ్రీ స్వామి వారికి పవిత్ర మాలికా ధారణ మహోత్సవం అత్యంత వైభవముగా జరిగినది. ఆ తరువాత అర్చక, పరిచారిక, పాచక, దేవస్థాన ఉద్యోగులకు, భక్తులకు పవిత్ర ధారణ చేసారు.