calender_icon.png 21 September, 2025 | 4:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

21-09-2025 02:49:49 PM

సికింద్రాబాద్: రాంగోపాల్ పేట్ పలోని వరద ప్రాంతాల్లో బీఆర్ఎస్ మాజీ మంత్రులు, హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. అనంతరం బాధితులకు పరామర్శించి, వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావ్ మాట్లాడుతూ... వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వానాకాలానికి ముందు నాలాలన్నీ క్లీన్ చేయాలని సూచించారు. గతంలో కేసీఆర్ నాయకత్వంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, కేటీఆర్ హైదరాబాద్ నగరంలో నాలాలన్ని క్లీన్ చేయించేవారని వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయానా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ.. బస్తీలను పట్టించుకొక, నాలాలు క్లీన్ చేయకపోవడం వల్ల నాలాల నుండి వరద వచ్చిందని మండిపడ్డారు. ఈ వరద వల్ల ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు కూడా కొట్టుకుపోయాయని, నగర ప్రజలకు తినడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. రేవంత్ ప్రభుత్వం ఒక్క రూపాయి సహాయం కూడా వరద బాధితులకు చేయలేదని, హైదరాబాద్ నగరంలో 7-8 మంది నాలాల్లో కొట్టుకుపోయి చనిపోయారు. ఆ చావులకు కారణం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే అని ఎద్దేవా చేశారు.

కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని, రేవంత్ రెడ్డి పూర్తిగా బరితెగించి మాట్లాడుతున్నాడన్నారు. ముఖ్యమంత్రి కుర్చీ పరువు తీసేలా రేవంత్ ప్రవర్తిస్తున్నాడు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారు. బతుకమ్మ పండుగకు రేవంత్ రెడ్డి ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదని, పండుగ పూట గ్రామాల్లో చెత్త ఎత్తడానికి, ట్రాక్టర్లలో డీజిల్ పోయడానికి డబ్బులు లేవు అని హరీశ్ రావు విర్చుకుపడ్డారు. ఈ బతుకమ్మ పండుగ పూటైనా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి, అతిపెద్ద పండుగైన బతుకమ్మ పండుగను జరుపుకునేటట్టు చెయ్ రేవంత్ రెడ్డి.