calender_icon.png 21 September, 2025 | 3:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వదేశీ వస్తువులనే కొందాం.. దేశాభివృద్ధికి తోడ్పాటు అందిద్దాం

21-09-2025 02:12:31 PM

తాండూరు,(విజయక్రాంతి): స్వదేశంలో తయారైన వస్తువులను కొనుగోలు చేసి దేశాభివృద్ధికి తోడ్పాటు అందిద్దాం అని వికారాబాద్ జిల్లా స్వదేశీ జాగరణ మంచ్ కో కన్వీనర్ శివశంకర్, కన్వీనర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వదేశీ వస్తువుల ఆవశ్యకత విదేశీ వస్తువుల బహిష్కరణ ద్వారా దేశ ఆర్థిక ప్రగతినీ ప్రపంచంలోని అగ్రరాజ్యాల సరసన నిలిపేందుకు సంకల్పించిన  ప్రధానమంత్రి కలలు నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.