calender_icon.png 21 September, 2025 | 3:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూర్యపేట జిల్లాలో పర్యటించిన మంత్రి ఉత్తమ్

21-09-2025 02:00:40 PM

హైదరాబాద్: సూర్యపేట జిల్లాలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం పర్యటించారు. పాలకవీడు మండలం జవహర్ జూన్ పహాడ్ ఎత్తిపోతల పథకం పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్ర ఉత్తమ్ మాట్లాడుతూ... ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకం అన్నారు. రేపు ఢిల్లీ వెళ్లి ఆల్మట్టి డ్యాంపై వాదనలు వినిపిస్తామని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టులను కట్టారని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుగుతోందని, విచారణ తర్వాత చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. కృష్ణానది జలాల్లో తెలంగాణ వాటా సాధించి తీరుతామని చెప్పారు.