21-09-2025 02:51:59 PM
వలిగొండ,(విజయక్రాంతి): బతుకమ్మ పండుగ వచ్చిందంటే పిల్లలు పెద్దలు మహిళలు అనే తేడా లేకుండా తీరొక్క పూలను తంగేడు గునుగు చిట్టి చామంతి ముత్యాల పువ్వు వంటివి వివిధ గ్రామాల్లో చేనుల్లో చేలకల్లో తిరుగుతూ సేకరించేవారు. అయితే నేడు రియల్ ఎస్టేట్ ప్రభావంతో ప్రతి గ్రామంలో చెట్లను తొలగించి వెంచర్లుగాను లేదా పొలాలుగాను మార్చి వేస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా తంగేడు పూలు, జిల్లేడు పూలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడి కొనుగోలు చేసే పరిస్థితి వచ్చింది. ఆదివారం ఎంగిలి పువ్వు బతుకమ్మ సందర్భంగా పలువురు పువ్వులే బంగారమాయనే అన్నట్లు తంగేడు పూలను, జిల్లేడు పూలను, పట్టుకుచ్చు పువ్వులను కొనుగోలు చేస్తూ కనిపించారు.