22 July, 2026 | 1:33 AM

జాబ్ క్యాలెండర్ ఎక్కడ..? నిరుద్యోగుల మీద కాంగ్రెస్ కపట ప్రేమ

30-06-2024 01:16 PM

హైదరాబాద్: నిరుద్యోగుల కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న మోతిలాల్ నాయక్‌ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పరామర్శించారు. మోతీలాల్ నాయక్ గత ఏడు రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తుంటే.. ఈ కాంగ్రెస్ సర్కారుకి చీమ కుట్టినట్లు కూడా లేదు అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల మీద కపట ప్రేమ చూపించి, వాళ్ళను ఎన్నికల కోసం వాడుకుని, గద్దెనెక్కిన తర్వాత ఆ నిరుద్యోగుల గుండెల మీద తన్నుతుందని ఆరోపించారు. ఆనాడు నిరుద్యోగులను రెచ్చగొట్టేందుకు ప్రొఫెసర్ కోదండరాం, రియాజ్, బల్మూరి వెంకట్, మురళి, రేవంత్ రెడ్డి అశోక్ నగర్ లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగారు,, బస్సు యాత్రలు చేశారని హరీశ్ రావు విమర్శించారు.  రాహుల్ గాంధీని అశోక్ నగర్ కు తీసుకువచ్చి ప్రామిస్ లు చేయించారు.. మీకు మాత్రం ఉద్యోగాలు వచ్చాయి, నిరుద్యోగులకు రాలేదు అని హరీశ్ అన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని.. అధికారంలోకి వచ్చాక గాలికొదిలేశార ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ఏమైంది?.. నిరుద్యోగుల సమస్యలపై అసెంబ్లీని స్తంభింపజేస్తామని హరీష్ రావు హెచ్చరించారు.