ఐపీఎస్ స్థాయికి ఎదిగినా..
- ఒక్క తప్పటడుగుతో అధఃపాతాళానికి!
- ఎన్‌పీఏ విచారణ సస్పెన్షన్ తర్వాత ట్రైనీ
- ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం
- పోలీస్ అధికారుల క్యారెక్టర్, నైతికతపై మళ్లీ మొదలైన చర్చ..
- నేర్చుకోవాల్సిన పాఠాలివే..!
రంగారెడ్డి, జూలై 21 (విజయక్రాంతి): కానిస్టేబుల్ స్థాయి నుంచి అసాధారణ పట్టుదలతో ఐపీఎస్ అధికారిగా ఎదిగి ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలిచిన ఒక అధికారి.. ఒక్క ఆరోపణ, వివాదంతో తన భవిష్యత్తును తీవ్ర సంక్షోభంలోకి నెట్టుకున్నారు. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై నేషనల్ పోలీస్ అకాడమీ ప్రాథ మిక ఆధారాలను పరిశీలించి సస్పెండ్ చేయ గా, అనంతరం ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఒకవైపు చట్టబద్ధమైన విచారణ కొనసాగుతుండగానే చోటుచేసుకున్న ఈ పరిణామాలు, ఉన్నత ఉద్యోగాల్లో ఉండే అధికారుల నైతిక వర్తన, క్రమశిక్షణతో పాటు సోషల్ మీడియా యుగంలో సమాజం స్పందించే తీరుపై కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.
ప్రాథమిక ఆధారాలతో చర్యలు.. వివాదంలో ట్రైనీ ఐపీఎస్...
మహిళా అధికారిపై లైంగిక వే ధింపులకు పాల్పడ్డారనే ఆరోపణల కేసులో సీసీటీవీ ఫుటేజ్, ఇతర ప్రాథమి క ఆధారాలను అ కాడమీ ప్రివిలేజ్ కమి టీ సమగ్రంగా విశ్లేషించింది. ఆరోపణ లలో ప్రాథమికంగా నిజముందని నిర్ధారించుకున్న అనంతరం (ఎన్పీఏ) అకాడమీకి చెంది న ఉన్నతాధికారులు ఆయనను తక్షణమే సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయి తే, తనపై వచ్చిన ఆరోపణలు కేవలం అవాస్తవాలని, తనకు న్యా యస్థానాలు మరియు చట్టంపై పూర్తి నమ్మ కం ఉందంటూ ఉదయ్ కృష్ణారెడ్డి సోషల్ మీడియాలో ప్రకటన విడుదల చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయన ఆత్మహత్యాయత్నం చేయడంతో ఈ వ్యవహారం మరింత నాటకీయ మలుపు తిరిగింది.
కథనం వెనుక అసలు నిజం..
ఈ సంఘటనపై పలువురు సామాజిక విశ్లేషకులు సైతం స్పందిస్తూ సమాజానికి మరియు మీడియాకు కీలకమైన సలహాలు సూచనలు చేశారు. జీవితంలో విజయం సాధించడం ఎంత కష్టమో, ఆ విజయాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. ఒక్క తప్పు నిర్ణయం లేదా ఒక్క వివాదం ఎన్నో ఏళ్ల కష్టాన్ని క్షణాల్లో తుడిచిపెట్టగలదు. ఏ విషయంలోనైనా ఒకవైపు కథ విన్న వెంటనే తీర్పు ఇవ్వకూడదు.సోషల్ మీడియా కాలంలో మొదటి కథనం వైరల్ కావచ్చు... కానీ చివరికి నిలిచేది మాత్రం విచారణ ద్వారా తేలే నిజమే... సోషల్ వేదికలో కూడా పలువురు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
ఐపీఎస్ అధికారులు ఎలా ఉండాలి..
పోలీస్ వ్యవస్థలో ఉన్నతాధికారులు కేవలం చట్టాన్ని అమలు చేసేవారు మాత్ర మే కాదు, సమాజానికి నైతిక బాధ్యులు. భవిష్యత్తులో ఐపీఎస్ శిక్షణకు వచ్చే అధికారు లకు ఈ ఘటన కొన్ని కీలక పాఠాలను గుర్తు చేస్తోంది. వ్యక్తిత్వ లోపం లేని క్యారెక్టర్ ఉన్నతమైన హోదాలు పెరిగేకొద్దీ వ్యక్తిగత క్రమ శిక్షణ ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారాన్ని చట్టబద్ధంగా ఉపయోగించాలే తప్ప దుర్వినియోగం చేయకూడదు.
ఆత్మనిగ్రహం ఒత్తిళ్లు, వివాదాలు ఎదురైనప్పుడు చట్టపరంగా పోరాడాలి తప్ప, భావోద్వేగాలకు లోనై ఆత్మహత్యాయత్నం వంటి ఆత్రుత నిర్ణయాలు తీసుకోవడం ఐపీఎస్ స్థాయి అధికారికి తగదు.
కండక్ట్ రూల్స్ ఉల్లంఘన ఆల్ ఇండియా సర్వీసెస్ (కండక్ట్) రూల్స్, 1968 ప్రకారం లైంగిక వేధింపులు లేదా తీవ్రమైన నైతిక పతనానికి పాల్పడితే తీవ్రమైన శాఖాపరమైన చర్యలతో పాటు ఉద్యోగం నుంచి తొలగించే నిబంధనలు ఉన్నాయి.
నమ్మకమే ప్రజాస్వామ్యానికి పునాది..
పోలీస్ అధికారులపై ప్రజలకు ఉండే నమ్మకమే ప్రజాస్వామ్యానికి పునాది. ఉద య్ కృష్ణారెడ్డి కేసులో అసలు నిజానిజాలు, బాధ్యులెవరనేది న్యాయస్థానాలు మరియు లోతైన విచారణ ద్వారానే బయటకు వస్తాయి. అయితే, ఎంతో కష్టపడి సాధించిన విజయాలను కాపాడుకోవడంలో నైతికత, నడవడిక ఎంత ముఖ్యమో ఈ ఘటన ప్రతి ఒక్కరికీ స్పష్టం చేస్తోంది.






