calender_icon.png 8 December, 2025 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్దిపేటకు రా.. నువ్ మునుగుతవో, తేలుతవో చూద్దాం: హరీష్ రావు

07-12-2025 06:55:49 PM

హైదరాబాద్: సిద్ధిపేట జిల్లా(Siddipet District)లోని చిన్నకోడూరు మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు(MLA Harish Rao) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చిన్నకోడూరులోని 450 మంది రైతులకు మొక్కజొన్న డబ్బులు రావాల్సి ఉందని, రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తమది రైతు ప్రభుత్వం అంటున్నారే తప్ప రైతులను ఆదుకోవడం లేదన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు రోజుల్లో డబ్బులు వేస్తున్నాము అంటున్నారే కానీ 50 రోజులు అయిన డబ్బులు రాలేదని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న రైతులకు బకాయిపడ్డ రూ. 450 కోట్ల డబ్బులు వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు.

గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్నోసార్లు చీరలు ఇచ్చింది.. రేవంత్ రెడ్డి ఒక్కసారి ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి ఓటు అడగాలి అంటే మహిళలకు బకాయిపడ్డ రూ. 60 వేల డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. వచ్చే ఏడాది నుండి పంట వేస్తేనే రైతు బంధు ఇస్తామని తుమ్మల నాగేశ్వరరావు అంటున్నారని.. నేటికి పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ కాలేదని విమర్శించారు. కాళేశ్వరం కూలిందని కేసీఆర్, హరీష్ రావులను బండకేసి కొట్టాలని రేవంత్ రెడ్డి మాట్లాడారని.. "రేవంత్ రెడ్డి దమ్ముంటే సిద్దిపేటకు రా.. రంగనాయక సాగర్ లో బండ కట్టి నిన్ను ఎత్తేస్తా.. నువ్ మునుగుతవో, తెలుతవో చూద్దాం.. నీళ్ళుండి నువ్ మునిగితే కాళేశ్వరం ఉన్నట్టు.. నువ్ తేలితే కాళేశ్వరం కూలినట్టు" అని హరీష్ రావు సవాల్ విసిరారు.