calender_icon.png 30 June, 2025 | 8:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తకోటలో హరీష్ రావుకు ఘన స్వాగతం పలికిన శ్రేణులు

30-06-2025 01:18:06 AM

కొత్తకోట జూన్ 29 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు అట పాటతో అందరిని ఆకట్టుకున్న దివంగత సాయి చంద్ 2 వ వర్ధంతి సందర్బంగా అమరచింతలో సాయి చంద్ విగ్రహ ఆవిష్కరణ సందర్బంగా కొత్తకోటకు వస్తున్నా మాజీ మంత్రి హరీష్ రావు కు కొత్తకోట బిఆరెస్ నాయకులు ఘన స్వా గతం పలికారు. ముందుగా శాలువా పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పొగాకు సుకెసిని విశ్వేశ్వర్ నివాసంలో ఏ ర్పాటు చేసిన తేనిటీ విందులో పాల్గొన్నారు. హరీష్ రావు వెంట మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, లక్ష్మా రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వరరెడ్డి, జైపాల్ యాదవ్, కొత్తకోట బిఆరెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.