13 July, 2026 | 2:07 AM

హరీశ్‌రావు క్యారెక్టర్ కసబ్ లాంటిదే

13-07-2026 12:35 AM

టీపీసీసీ నాయకుడు మెట్టు సాయికుమార్ 

హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): హరీశ్‌రావు క్యారెక్టర్ కసబ్ లాంటిదేనని టీపీసీసీ నేత, ఫిషరీశ్ చైర్మ న్ మెట్టు సాయికుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయడంలో కేసీఆర్ పాత్ర ఎంత ఉందో, హరీశ్‌రావు పాత్ర కూడా అంతే ఉందని ఆయన మండిపడ్డారు. ఆదివారం మెట్టు గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. హరీష్ రావు అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు. చిల్లర మాటలు మాట్లాడే ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.

ప్రజా ప్రభుత్వంలో 30 నెలల నుంచి  సీఎం రేవంత్ రెడ్డి 18 గంటల కష్టపడి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాపాలనలో తెలంగాణ సస్యశ్యామలంగా ఉందని, ఇప్పటికైనా హరీశ్‌రావు చిల్లర మాటలు మానాలని మెట్టు సాయికుమార్ హితవు పలికారు.