భగవద్గీత జ్ఞానం ప్రకారం ఆచరిస్తేనే ముక్తి
త్రైత సిద్ధాంత గ్రంథాల ఇంటింటి ప్రచారం
కోదాడ, జూలై 12: ప్రతి మనిషి త్రైత సిద్ధాంత భగవద్గీత జ్ఞానం తెలుసుకొని, ఆధ్యాత్మిక చట్టం ప్రకారం ఆచరించినప్పుడే జీవుడు ముక్తిమార్గం చేరగలుగుతాడని ప్రబోధ సేవా సమితి కోదాడ శాఖ సభ్యులు పేర్కొన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని నయానగర్, కృష్ణప్రియ ధియేటర్ పరిసర ప్రాంతాల్లో త్రైత సిద్ధాంత గ్రంథాల ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
మనిషి తలలో ఉన్న మూడు గుణాల విషయాలే వేదాలని, నాలుగు వేదాలను వదిలిపెట్టి, పంచమ వేదం భగవద్గీతలోని శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన జ్ఞానం ప్రకారం నడుచుకుంటే దేవుడిని చేరుకోవచ్చని తెలిపారు. ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు త్రైత సిద్ధాంతం ఆధారంగా రచించిన ఆధ్యాత్మిక గ్రంథాలను ఇంటింటికి తిరిగి పరిచయం చేశారు. పట్టణ వాసులు ఆసక్తిగా వివరాలడిగి తెలుసుకొని ఆయా గ్రంథాలను కొనుగోలు చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో ముత్తవరపు శైలజ, వంగాల మహేష్, సైదా, నర్సింహారావు పాల్గొన్నారు.






