21 April, 2026 | 3:47 AM

హరీశ్.. ఢిల్లీకి ఎందుకు వెళ్లావ్?

21-04-2026 02:21 AM
  1. బీజేపీ నేతల కాళ్లు పట్టుకునేందుకే కదా..
  2. కాళేశ్వరం కేసును సీబీఐకి ఇవ్వకుండా కేంద్రం నిర్లక్ష్యం
  3. నిజాలు బయటికి రావొద్దనే ఇవాళ వాళ్లు సభ పెట్టుకున్నారు
  4. అవినీతిని కాపాడుకోవడానికి మరో ఇద్దరేమో ఢిల్లీకి పరుగు
  5. మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
  6. మేడిగడ్డ బరాజ్‌ను పరిశీలించిన సీఎం
  7. శ్రీ కాలేశ్వర ముక్తేశ్వర దేవాలయం, బస్టాండ్ అభివృద్ధికి శంకుస్థాపన

మహబూబాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీబీఐ విచారణ భయంతో.. హరీశ్‌రావు చెప్పాపెట్టకుండా ఢిల్లీ పర్యటనకు వెళ్లారని.. ‘మీరు ఢిల్లీకి ఎందుకు వెళ్లారో’ నిజాలను బయట పెట్టా లని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ నేతల కాళ్లు పట్టుకునేందుకు హరీశ్‌రావు ఢిల్లీ పర్యటనకు వెళ్లారని, ఒక పక్కన బ్రహ్మాండం బద్దలవుతుంది.. మాకు జీవన్ టోన్ దొరికింది.. మా కండలు పెరుగుతయ్.. మేం అధికారంలోకి వస్తం’ అని ప్రగల్భాలు పలుకుతున్నారని, అంతపెద్ద జీవన్‌టోన్ మీకు దొరుకుతున్నప్పుడు మీరు ఢిల్లీకి ఎందుకు చెప్పాపెట్టకుండా పరుగెత్తాల్సి వచ్చిందని నిలదీశారు.

శ్రీ కాలేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి కోసం రూ.198 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పునర్ అభివృద్ధి పనులకు, అలాగే రూ.3.70 కోట్లతో నిర్మించనున్న కాలేశ్వరం బస్టాండ్ పనులకు రేవంత్‌రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించాక రేవంత్‌రెడ్డి మీడియాతో మా ట్లాడారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రాజెక్టులను నిర్మించాయని, గోదావరి జలాల వినియోగంపై సరిహద్దు రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే రైతులకు ఉచితంగా విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. గోదావరి జలాలతో ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలని 1975లో జలగం వెంగళరావు ఆనాటి మహారాష్ట్ర సీఎంతో ఒప్పందం చేసుకున్నారన్నారు. ఆ తర్వాత వైఎస్ హయాంలో 2009 లో 38,063 కోట్లతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మొదలు పెట్టారన్నారు. ప్రాణహిత చేవెళ్లకు 11,700 కోట్లు ఖర్చు చేశారన్నారు.

ప్రాణహిత  ఆర్థిక, రాజకీయ ప్రయోజనం లేదని కేసీఆర్ రీడిజైనింగ్ పేరుతో పేరు, ఊరు, అంచనాలు మార్చారని, ఆ అంచనాలను 1 లక్షా 50 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. 2016లో మొదలు పెట్టిన మేడిగడ్డను వారు 2019 లో పూర్తిచేశామని, ప్రారంభించారని, ఇది అద్భుతమని భ్రమలు కల్పించి 2018 ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందారన్నారు. 2023 లోనే మేడిగడ్డ కుప్పకూలిందని, అన్నిటినీ దాచిపెట్టి 2023 ఎన్నికల్లో ప్రయోజనం పొందాలనుకున్నా రని, దాచినా దాగని నిజాలను ప్రకృతి బయటపెట్టిందన్నారు.

ప్రాజెక్టులో సమస్యలు రాగానే 2023, నవంబర్ 1న ఎన్‌డీఎస్‌ఏ ప్రాథమిక రిపోర్ట్ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే ఇచ్చిందని తెలిపారు. ఆ నివేదికను కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. ఈ దోపిడీపై పీసీ ఘోష్ కమిటీ సంపూర్ణ నివేదిక ఇచ్చిందని, దీనిపై మా రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలని కేంద్రానికి తీర్మానం పంపిందన్నారు. కేసీఆర్, హరీశ్‌రావును జైల్లో వేయాలని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కిషన్‌రెడ్డి ఆనాడు అన్నారని, కానీ కేంద్ర ప్రభుత్వం దీనిపై ఇప్పటివరకు నిర్లక్ష్యం చేస్తోందని ముఖ్యమంత్రి ఆరోపించారు.

కాళేశ్వరంతో ఇప్పటి వరకు లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేకపోయారని, కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేయాలని మా ప్రభుత్వం సంకల్పించిందన్నారు. నెల రోజుల ముందే అధికారులతో, సాంకేతిక నిపుణులతో ఇవాళ సమావేశం పెట్టుకు న్నామని, కానీ నిజాలు బయట పడతాయని తెలిసి, ఇవాళ కావాలని వాళ్లు పొలిటికల్ మీటింగ్ పెట్టుకున్నారని సీఎం విమర్శించారు. ‘అయినా మేం బీఆర్‌ఎస్ సభ కు అనుమతులు ఇచ్చామన్నారు.

కాళేశ్వరంపై విచారణకు ఆదేశిస్తారని తెలిసి ‘బీజేపీ నేతల కాళ్లు పట్టుకునేం దుకు హరీశ్ ఢిల్లీకి పరుగెత్తారు’ అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై గతంలో సీబీఐ విచారణ చేయా లని కోరామని.. ఈ విషయంలో మళ్లీ ఇటీవల లేఖ రాశామన్నారు. దాంతో కేంద్రంలో కదలిక వచ్చిందని, ఒక వేళ తక్షణం సీబీఐ విచారణకు ఆదేశించకపోతే త్వరలోనే ఆందోళన కార్యక్రమాన్ని కాళేశ్వరం నుంచి ప్రారంభిస్తామని వారికి సమాచారాన్ని పంపామన్నారు.

దాంతో బెంబేలెత్తి విచారణకు ఆదేశిస్తారని హడావిడిగా హరీశ్‌రావు, వినోద్‌రావు ఢిల్లీకి పరుగెత్తారని ఆరోపించారు. మీరు కేసులు, ఇంకోదాని కోసమైనా ప్రజలకు ఎందుకు చెప్పలేదని.. రాజ్యసభ సభ్యుడు, శాసనసభలో ఉపనాయకుడు, ముఖ్యనేత ఢిల్లీ పర్యటనలో ఉంటే రహస్యంగా ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. హరీశ్‌రావు బీజేపీ నేతలను కలిసేందుకు వెళ్తున్నాడని మీడియా బయటపట్టే వరకు ఎలాంటి ప్రకటన చేయలేదంటే మీ ఉద్దేశం ఏం టీ? అన్నారు.

ఎంతకాలం బీజేపీని ప్రసన్నం చేసుకొని సీబీఐ విచారణ జరుగకుండా ఆపుతరు? ఈ రకంగా తప్పించుకోవాలని చూడడం, బీజేపీని అడ్డం పెట్టుకొని అవినీతిని కాపాడుకోవాలనే ఆలోచనను భవిష్యత్లో చూస్తూ ఊరుకోమని, అవసరమైన ప్రణాళికలతో ముం దుకు వెళతామన్నారు. హరీశ్ తెలివి ఉండి మాట్లాడుతున్నాడో, లేక మాట్లాడుతున్నాడో తెలియడం లేదని, శ్రీపా ద ఎల్లంపల్లి ఈ ప్రాజెక్టుకు ప్రాణవాయువని, ఎల్లంపల్లి నీటితోనే రాష్ట్రంలో అత్యధిక పంట పండించారన్నారు. 

కాలేశ్వరం విచారణపై సీబీఐ ఎందుకు మౌనంగా ఉంది? 

మేం పదేపదే లేఖలు రాసినా ఎందుకు కేంద్రం స్పందిచడం లేదని, హరీశ్ రహస్య పర్యటన వెనక మతలబు ఏంటో తెలంగాణ ప్రజలకు చెప్పాలని సీఎం డి మాండ్ చేశారు. ఢిల్లీలో ఎవరెవరిని కలిశారో హరీశ్ బహిర్గతం చేయాలన్నారు. జడ్జిమెంట్ ప్రకటించకముం దు వాదించడానికి వీలుండదని, మరి న్యాయవాదులను కలవడానికి వెళ్లాల్సిన అవసరం ఏముందని, కాళేశ్వరంలో దోషులను వదిలేది లేదని, దోషులను శిక్షించేందు కు అవసరమైన కార్యాచరణతో ముందుకు వెళతామన్నారు.

ప్రాజెక్టును  ఊరికే వదలం.. రిపేర్లు చేసి రైతాం గానికి సాగు నీరు అందిస్తామని స్పష్టం చేశారు. 520 బోర్ రిగ్స్ ద్వారా శాంపిల్స్ సేకరించి, నివేదికను సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌కు ప్రభుత్వం పంపనుందని, అక్కడ ల్యాబ్‌లో పరీక్షల అనంతరం బ్యారేజ్ డ్యామేజీపై పూర్తి అవగాహన రానుందని సీఎం తెలిపారు. బ్యారేజ్ వద్ద సీకేంట్ పైల్స్‌కు సంబంధించి ప్యారలల్ క్రాస్ హోల్ సెస్మిక్ టెస్ట్ వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 

ఆలయ అభివృద్ధి పనులు, నూతన బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన

శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి పనులు, నూతన బస్టాండ్ నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. జయశంకర్ భూ పాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కాలేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి కోసం రూ.198 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పునర్ అభివృద్ధి పనులకు, అలాగే రూ.3.70 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న కాలేశ్వరం బస్టాండ్ పనులకు రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్ర మంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తంకుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వివేక్, ఎంపీ వేం రెడ్డి నరేందర్‌రెడ్డి, వంశీకృష్ణ పా ల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం శ్రీ కాలేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకుని మహా రుద్రాభిషే కం నిర్వహించారు. అనంతరం శుభానందదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు ముఖ్యమంత్రితో పాటు మంత్రులకు స్వామివారి శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అంద జేసి పట్టు వస్త్రాలతో సన్మానించారు. కాళేశ్వరం విచ్చేసిన ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పుష్పగుచ్ఛం అందించి ఘనస్వాగతం పలికారు.