16 June, 2026 | 1:21 AM

ప్రేమలో పూర్తిగా మునిగిన కుర్రాడి కథే దీవాన

16-06-2026 12:09 AM

‘శుభం’ సినిమా కంటే ముందే ‘దీవాన’ ఆఫర్ వచ్చింది. మూడు రోజులు షూటింగ్ చేస్తే, పది రోజులు వర్క్‌షాప్స్ చేశాం. హైదరాబాద్, ఓల్డ్ సిటీ గ్యాంగ్ కలిసి చేసిన చిత్రమిది. అల్లు అరవింద్‌కు మా మూవీ విపరీతంగా నచ్చింది. ఆయన నన్ను పిలిచి కొన్ని సీన్స్ గురించి మాట్లాడారు. బాగా నటించావని చెప్పారు. చాలా హ్యాపీగా ఫీలయ్యా. 

‘మెయిల్’ సినిమా తర్వాత నాకు వస్తున్న ప్రతి అవకాశాన్నీ విలువైనదిగా భావిస్తున్నా. ప్రతి ప్రాజెక్ట్‌కు పూర్తి ఎఫర్ట్స్ పెట్టి నటిస్తున్నా. ప్రస్తుతం ‘కల్కి2’లోనూ నటిస్తున్నా. అలాగే ‘రోమియో జూలియట్’ అనే సినిమా చేస్తున్నా. 

యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్‌రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘దీవాన’. ఈ బ్యూటిఫుల్ లవ్‌స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయం కానున్నారు. ఈ చిత్రాన్ని వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూ టర్స్ ద్వారా ఈ నెల 19న రిలీజ్‌కు వస్తోందీ సినిమా. ఈ నేపథ్యంలో హీరో హర్షిత్‌రెడ్డి ఈ మూవీ హైలైట్స్‌ను మీడియాతో పంచుకున్నారు. 

ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు మున్నా. ఇది డిఫరెంట్ క్యారెక్టర్ కాబట్టి ఈ క్యారెక్టర్‌లోకి ఇన్వాల్వ్ అవడానికి కొంచెం టైమ్ పట్టింది. ఒక షెడ్యూల్‌లో ‘ఔన్రా చిల్లరగాన్నేరా’ అనే డైలాగ్ ఉన్న సీన్ చేశాం. ఆ సీన్ తర్వాత నుంచి మున్నా క్యారెక్టర్ మీటర్ తెలిసింది.  

ప్రేమలో పూర్తిగా మునిగిన ఓ కుర్రాడి కథే ‘దీవాన’. మనం చాలా ప్రేమకథలు చూసి ఉంటాం కానీ ఇందులో ఒక కొత్త పాయింట్, ఎమోషన్ ఉంటుంది. ఆ పాయింట్‌తో వచ్చే ఇంటర్వెల్ మిమ్మల్ని షాక్‌కు గురిచేస్తుంది. కొద్ది నిమిషాలు మీరు అలా ఉండిపోతారు.  

మా మూవీలో నా పిల్లరా అనే డైలాగ్ రిలీజ్ చేసినప్పటి నుంచి ‘అర్జున్‌రెడ్డి’ పోలిక వచ్చింది. అయితే హైదరాబాద్‌లో కుర్రాళ్లు అలాగే మాట్లాడుతారు. అర్జున్‌రెడ్డి సినిమా తర్వాత ఆ మాడ్యూలేషన్ బాగా ప్రేక్షకులకు రీచ్ అయ్యింది. సినిమాలో అమ్మాయి నాకు హింట్ ఇచ్చిందా, సతాయించిందా, వద్దన్నదా అనేది మీరు సినిమాలోనే చూడాలి.