13 July, 2026 | 9:40 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

మరో భారీ ఛాన్స్ వరించినట్టే..?

09-02-2026 02:29 AM

ఇన్‌స్టా బ్యూటీ ఇమాన్వీ ఇస్మాయిల్ తొలి సినిమాకే ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు హీరోయిన్‌గా మారింది. ‘ఫౌజీ’ సినిమాలో కథానాయికగా దర్శకుడు హను రాఘవపూడి ఈ మద్దుగుమ్మను ఎంపిక చేయగానే.. ఆమె అదృష్టం మామూలుగా లేదు అంటూ పలువురు అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఇక ఇప్పుడు ‘ఫౌజీ’ నిర్మాణంలో ఉం డగానే మరో భారీ అవకాశం ఈ అందాలభామను వరించినట్టు తెలుస్తోంది.

పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా ఇమాన్వీ అయితే బావుంటుందనే అభిప్రాయాన్ని పవన్‌తో సురేందర్‌రెడ్డి వ్యక్తం చేశారట. పవన్ కూడా ఈ విషయంపై సానుకూలంగా స్పందించారని టాక్. ఈ విషయంలో తాను పట్టించుకోనని, పాత్రకు ఎవరు సూట్ అయితే.. వారినే ఎంపిక చేయమని పవన్ చెప్పారట. దీంతో ఇమాన్వీ ఎంపిక దాదాపు ఖరారైందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అదృష్టం ఉంటే అవకాశాలు వాటంతటవే వస్తాయ నేది మరోమారు ఇమాన్వీ విషయంలో నిరూపితమవుతోంది.