టిప్పు సుల్తాన్ గొప్ప యోధుడు
- ఆయన పాలనలో మత సామరస్యానికి ప్రాధాన్యం
- మాజీ డీజీపీ డాక్టర్ జే పూర్ణచంద్రరావు
- విశాఖలో టిప్పు సుల్తాన్ వర్ధంతి సభ
విశాఖపట్నం, మే 4: బ్రిటిష్ వలసవాద విస్తరణకు ధీటుగా ఎదురు నిలిచిన యోధుడు టిప్పు సుల్తాన్ వర్థంతి సందర్భంగా సోమవా రం నిర్వహించిన విశాఖపట్నంలో నిర్వహించిన విస్తృత స్థాయి స్మారక సభలో జాతీయ సమన్వయకర్త, మాజీ డీజీపీ డాక్టర్ జే పూర్ణ చంద్రరావు మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్, పెరియర్ కాన్షీరాం ఆలోచనా దృక్పథంతో నిర్వహించామన్నారు. టిప్పు సుల్తాన్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యాన్ని అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించి న నాయకుడని డాక్టర్ పూర్ణచంద్రరావు అన్నా రు.
విదేశీ శక్తులను ఎదుర్కోవాలంటే అంతర్జాతీయ మద్దతు అవసరమని భావించి ఫ్రాన్స్ తో మైత్రి ఏర్పరచుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఆయన దూరదృష్టికి నిదర్శనమని తెలిపారు. యూరోపియన్ శైలిలో సైనిక శిక్షణ, ఆర్టిలరీ బలోపేతం వంటి చర్యల ద్వారా సైన్యా న్ని ఆధునీక రించినట్టు వివరించారు. 1799లో జరిగిన యుద్ధంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో పాటు హైదరాబాద్ నిజాం, మరాఠా సమాఖ్యలు కూటమిగా ఏర్పడి టిప్పు సుల్తాన్‌పై దాడి చేసిన విషయం చరిత్రలో నమోదై ఉందని తెలిపారు.
శ్రీరంగపట్నం వద్ద జరిగిన తుది యుద్ధంలో టిప్పు సుల్తాన్ చివరి వరకు పోరాడి వీరమరణం పొందినట్టు పేర్కొన్నారు. టిప్పు సుల్తాన్ పరిపాలనలో మతసామరస్యానికి ప్రాధాన్యం ఉన్నట్లు ఉదాహరణలతో వివరించారు. శృంగేరి శారదా పీఠం, మెల్కోటే, నంజనగూడు దేవాలయాలకు ఆయన అందించిన సహాయం చారిత్రక ఆధారాలతో నమోదై ఉందని చెప్పారు. అలాగే పూర్ణయ్య, కృష్ణారావు, శమయ్య అయ్యంగార్ వంటి హిందూ అధికారులు పరిపాలనలో కీలక స్థానాల్లో పనిచేసినట్టు పేర్కొన్నారు.
పాలనలో సామర్థ్యానికి ప్రాధాన్యం ఇచ్చిన విధానాన్ని ఇది సూచిస్తుందని అన్నారు. అంబేద్కర్, పెరియర్, కాన్షీరాం ఆలోచనల ప్రాముఖ్యతను పూర్ణచంద్రరావు గుర్తు చేశారు. సమాజంలో అసమానతలు ఉన్నంతకాలం నిజమైన స్వేచ్ఛ సాధ్యం కాదని, ఆత్మగౌరవం లేకుండా విముక్తి సాధ్యం కాదని, సంఖ్యలో పెద్ద వర్గాలు ఐక్యంగా నిలబడితేనే అధికారంలో భాగస్వామ్యం సాధ్యమని ఈ మహానుభావులు పేర్కొన్నారని చెప్పారు. విమర్శనాత్మకంగా చరిత్రను చదవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడినా, సమాన వాటా ప్రశ్న ఇంకా కొనసాగుతోందన్నారు.
రాష్ట్రంలో ముస్లింలు సుమారు 8 శాతం ఉన్నప్పటికీ, ఇప్పటివరకు కేవలం 54 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారని, ప్రస్తుత అసెంబ్లీలో కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారని చెప్పారు. జనాభా నిష్పత్తి ప్రకారం కనీసం 14 మంది ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక కమ్మ, రెడ్డి వర్గాల ప్రాతినిధ్యం గణనీయంగా 24 రెట్లు ఎక్కువగా ఉన్నదని, రెండు కులాల నుంచి 1207 మంది ఎమ్మెల్యేలు, 200 మంది మంత్రులు రావడం రాజకీయ అసమానతలను చూపిస్తోందని అన్నారు.
రాష్ట్ర కాబినెట్‌లో కూడా ముస్లింలకు తగిన స్థాయి ప్రాతినిధ్యం లేదని, ఇది సమాన అవకాశాల లోపాన్ని సూచిస్తోందని వ్యాఖ్యానించారు. ముస్లింల పరిస్థితి మాదిరిగానే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కూడా న్యాయం కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో బహుజన వర్గాలు ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని, టిప్పు సుల్తాన్ స్పూర్తి తో సమాజం కలిసి నడవాలని పిలుపునిచ్చా రు. వలసవాదానికి ఎదురు నిలిచిన పోరాటాల స్పూర్తిని కొనసాగిస్తూ, సమానత్వం సామాజిక న్యాయం దిశగా సమాజం ముం దుకు సాగాలని డాక్టర్ పూర్ణచంద్రరావు అన్నా రు. కార్యక్రమంలో మొహమ్మద్ యాసిన్ , అఫ్సర్ ఖాన్, అస్లాం ఖాన్ ఇతర ముస్లిం నాయకులు బహుజన నాయకురాలు లక్ష్మి తదితరులు మాట్లాడారు. ఓల్డ్ టౌన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






