16 July, 2026 | 9:26 AM

బ్లూ కలర్ ఘీ రైస్ ట్రై చేశారా!

23-04-2024 12:05 AM

సోషల్ మీడియాలో రకరకాల పోస్టు లను చూస్తుంటాం. వాటిలో పలు వీడి యోలు వైరల్ అవుతుంటాయి. ఇప్పటి వరకు ఆహారంపై ఎన్నో రకాల వింత ప్రయోగాలు చూసే ఉంటారు. అయితే మనం రోజూ తీసుకునే అన్నంతో వింత ప్రయోగం జరిగింది. అదే బ్లూ కలర్ ఘీ రైస్. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ బ్లూ రైస్‌ని చాలా మంది ఎంతో ఇష్టపడుతున్నారు. ఒక ఫుడ్ వ్లాగర్ ఇన్‌స్టా గ్రామ్‌లో నెయ్యి రైస్ రెసి పీలో చమత్కారమైన ట్విస్ట్‌తో బ్లూ కలర్ నెయ్యి అన్నం రెసిపీని తయారు చేశారు. 

అది ఎలా తయారు చేశాడో ఓ సారి చూసేయండి!

ఈ ఫుడ్ వ్లాగర్ శంకుపూలను ఉపయోగించి ఈ బ్లూ రైస్‌ను తయారు చేశారు. శంకుపూలను ఒక బౌల్‌లోకి తీసుకొని శుభ్రంగా కడగాలి. రేకులను వేరు చేయాలి. ఒక గిన్నెలో ఒక కప్పు బాస్మతి బియ్యాన్ని వేసి 15 నిమిషాలు పక్కన పెట్టు కోవాలి. మరోక పాత్రలో అన్నం వండ టానికి కావాల్సినన్నీ నీటిని తీసుకొని మరి గించి అందులో ఈ శంకుపూల రేకులను వేయాలి. ఆ నీరు బాగా మరిగిన తరువాత ఒక చెంచాతో నీళ్లలోంచి పువ్వులను తొలగించుకోవాలి. ఆ నీళ్ళు నీలి రంగులోకి మారిపోతాయి. అప్పుడు నానబెట్టిన బియ్యాన్ని మరిగిన నీళ్ళలో వేసుకోవాలి. అన్నం ఉడికిన తర్వాత అందులో నెయ్యి కలుపుతారు.

మరో పాన్‌లో కొంచెం నెయ్యి వేసి వేడయ్యాక అందులో మసాలా దినుసులు, బే ఆకులు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. కొన్ని సెకన్ల తర్వాత ఉడికించిన బ్లూ రైస్ వేసి బాగా కలిపేసు కోవాలి. మరో రెండు నిమిషాలు అన్నం బాగా దమ్ముకు పెట్టేసి దించేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.