సోషల్ మీడియాలో ఉన్న మహిళా సెలబ్రిటీల తాజా సమాచారం..!
ఎన్నో సార్లు అబార్షన్ అయ్యింది..!
పెళ్ళి తర్వాత నేను ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నాను. ధోబీ మూవీ షూటింగ్ సమయంలో నా కొడుకు ఆజాద్ పుట్టాడు. కానీ అంతకుముందే సంతానం కోసం ఎంతో ట్రై చేశాను. ఐదు సంవత్సరాలలో ఎన్నో సార్లు నాకు అబార్షన్ అయ్యింది. చివరికి ఐవీఎఫ్ ద్వారా ఆజాద్ పుట్టాడు. ఆ క్షణం నా జీవితంలో మర్చిపోలేనిది. వాడు పుట్టిన రోజు నుంచి వాడితో ఉన్న ప్రతి రోజు నాకు గొప్ప రోజు. పిల్లాడి కోసం పదేళ్ళ పాటు ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా.. ఆ రోజులన్నీ నేను వాడితో ఆనందంగా గడిపాను.
కిరణ్ రావు, ప్రొడ్యూసర్, స్కిప్ట్ రైటర్
సమాజానికి సేవ చేయాలనే లక్ష్యం
యూపీఎస్సీ 2023 పరీక్షా ఫలితాలలో తెలంగాణకు చెందిన గాడిపర్తి సాహి దర్శిని 112వ ర్యాంక్ సాధించారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ కుంట్లూర్‌లోని గాడిపర్తి గిరిధర్, మణిదీపికల కూతురు గాడిపర్తి సాహిదర్శిని 112వ ర్యాంక్ సాధించి సత్తా చాటింది. దేశవ్యాప్తంగా మొత్తం 1016 మంది సివిల్స్‌కు ఎంపిక కాగా అందులో తమ కూతురు 112వ ర్యాంక్ సాధించడం సంతోషంగా ఉందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో పట్టుదలతో ఎంతో కష్టపడి చదివి సివిల్స్ ర్యాంక్ సాధించిందని వారు తెలిపారు.
నా మద్దతు వారికే..!: అలేఖ్య రెడ్డి
నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి తాజాగా ఆమె తన ఇన్ స్టాగ్రామ్‌లో షాకింగ్ పోస్ట్ చేసింది. రాబోయే ఎన్నికల్లో తన సపోర్ట్ ఆ పార్టీకేనంటూ చెప్పుకొచ్చింది. తన మద్దతు బాలయ్య మామయ్యేకే అంటూ టీడీపీకే ఓటు వేసింది. ఈ మేరకు ఆమే ఇన్‌స్టాలో బాలకృష్ణ ఆయన తనయుడు మోక్షజ్ఞతో ఉన్న ఫోటోను షేర్ చేసి.. “నేను ఏ వైపు ఉన్నానని ఎప్పుడూ నాకు ప్రశ్నలు ఎదురు అవుతూనే ఉన్నాయి. కానీ దానికి ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకున్నాను. నా అంగీకారం, ప్రేమ నా కుటుంబం వైపే ఉంటాయి” అంటూ అలేఖ్య పోస్ట్‌లో రాసుకొచ్చింది.






