6 June, 2026 | 2:49 AM

ఎల్లమ్మ పండుగకు వచ్చి కానరాని లోకాలకు..

06-06-2026 12:56 AM
  1. మంజీరా నదిలో ఐదుగురు గల్లంతు
  2. ముగ్గురి మృతదేహాలు లభ్యం
  3. మృతి చెందిన వారిలో తల్లి, ఇద్దరు కుమార్తెలు
  4. మరో ఇద్దరిని కాపాడిన బంధువులు
  5. నిజామాబాద్ ఆస్పత్రికి తరలింపు
  6. కామారెడ్డి జిల్లా బోల్లక్‌పల్లిలో విషాదం

బాన్సువాడ, జూన్ 5 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మంజీరా పరివాహక ప్రాంతంలో ఎల్లమ్మ తల్లి వేడుకల కోసం వచ్చిన బంధువుల్లో ఐదుగురు మంజీర నదిలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు మృతదేహాలను వెలికి తీసిన ఈతగాళ్లు మరో ఇద్దరిని బంధువులు కాపాడారు. వివరాల్లోకి వెళ్లితే .. పిట్లం మండలం మంగళ్ కిష్టాపూర్ గ్రామానికి చెందిన వారు మంజీరా ప్రాంతంలో ఎల్లమ్మ తల్లి వేడుకల కోసం వచ్చి కనిపించని లోకానికి వెళ్లిపోవడంతో ,మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో బాన్సువాడ ఆసుపత్రి దద్దరిల్లింది. ఎల్లమ్మ తల్లి వేడుక చేసుకున్న తర్వాత, మంజీరా నదిలో స్నానానికి దిగిన ముగ్గురు ముగ్గురు మృతి చెందారు.

మరో ఇద్దరు గల్లంతయ్యారు మృతులు తల్లి అనిత (40) కుమార్తె శివాని(13), పావని ( 14) ముగ్గురు మృతదేహాలను బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన మరో బాలుడు భాను ప్రసాద్ ను కాపాడి ఆసుపత్రికి తరలించారు. మరో వ్యక్తి సుశాంత్ ను బంధువులు రక్షించారు. తల్లితోపాటు ఇద్దరు పిల్లలు మంజీర నదిలో పడి జల సమాధి కావడంతో వారి కుటుంబ సభ్యుల రోదన పలువురిని కలచివేసింది. సంఘటన స్థలానికి పోలీసులు వెళ్లి జరిగిన సంఘటనపై ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.