6 June, 2026 | 2:44 AM

పర్యావరణాన్ని కాపాడుదాం

06-06-2026 12:57 AM

లయన్స్ క్లబ్ జోనల్ అధికారి పోలవరపు సంతోష్

తుంగతుర్తి, జూన్ 5: ప్రతి ఒక్కరు మొక్కలు నాటి, పర్యావరణాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై, ఉందని లయన్స్ క్లబ్ జోనల్ అధికారి పోలవరపు సంతోష్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఐఓసీ బంకులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని మొక్కలకు శ్రీకా రం చుట్టారు.

ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రతి గ్రామం, ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి ,పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. మొక్కలు నాటడం, నీటిని పొదుపుగా వాడడం, ప్లాస్టిక్ వస్తువులు నిషేధం పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి లయన్స్ క్లబ్ అధ్యక్షులు తల్లాడ కేదారి, సెక్రటరీ గుండ గాని రాము ,కోశాధికారి ఓరుగంటి శ్రీనివాస్, కోఆర్డినేటర్లు ఓరుగంటి సుభాష్, ఎనగందుల గిరి, శ్రీనివాస్, డాక్టర్ చారి, డాక్టర్ పప్పుల వెంకన్న, గుడిపూడి లక్ష్మణరావు, ఎనగందుల సంజీవ, తదితరులు పాల్గొన్నారు.