12-11-2025 01:21:51 AM
ఘట్ కేసర్, నవంబర్ 11 (విజయక్రాంతి): ఐజిఎస్ స్టూడెంట్ చాప్టర్‌అనురాగ్ యూనివర్సిటీ సివిల్ ఇంజనీరింగ్ విభాగం సంయుక్తంగా ఇంజనీరింగ్ అండ్ ఎనేబ్లింగ్ ఇంజనీరింగ్ అనే అంశంపై ఒక అంతర్జాతీయ గెస్ట్ లెక్చర్ను మంగళవారం నిర్వహించింది. ఈకార్యక్రమానికి ఎ.ఆర్.యు.పి. అసోసియేట్ డైరెక్టర్ స్టీఫెన్ హెండ్రీ యునైటెడ్ కింగ్డమ్ రిసోర్స్ పర్సన్గా వ్యవహరించారు. ఆయన సివిల్ ఇంజనీరింగ్లో తాజా ధోరణులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు, సస్టైనబుల్ ఇంజనీరింగ్ పద్ధతుల గురించి స్పష్టంగా ఆసక్తికరంగా వివరించారు.
ఈ కార్యక్రమానికి డాక్టర్ పల్లవి బద్రి, సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి, ప్రొఫెసర్ వి. విజయ్ కుమార్, డీన్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, డాక్టర్ రవి బద్రి, ఎ.ఆర్.యు.పి. సంస్థ నుండి హాజరయ్యారు. కార్యక్రమ సమన్వయకర్తలుగా డాక్టర్ పి. ప్రదీప్ కుమార్, టి.ఎన్.పీ. చందన్ వ్యవహరించారు. విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు ఉత్సాహంగా పాల్గొని, రిసోర్స్ పర్సన్తో పరస్పర చర్చలు జరిపారు. ఈ లెక్చర్ ద్వారా విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో సివిల్ ఇంజనీరింగ్లో ఉన్న ఆధునిక దృక్పథాలను అవగాహన చేసుకున్నారు.