calender_icon.png 11 May, 2025 | 2:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడవి పంది దాడిలో మేకల కాపరి మృతి

10-05-2025 12:17:19 AM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): అడవి పంది దాడిలో మేకల కాపరి మృతి చెందిన విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ధోడంద గ్రామ పంచాయతీ పరిధిలోని చిలాటి గూడ గ్రామానికి చెందిన మేకల కాపరి మడవి బొజ్జు (60) ప్రతి రోజు మాదిరిగానే అటవీ ప్రాంతంలో మేకలను మేపడనికి వెళ్ళాడు. ఈ క్రమంలో శుక్రవారం మేకలను మేపుతుండగా మడవి బొజ్జు పై ఒక్కసారిగా అడవి పంది దాడి చేసింది. దింతో ఛాతి భాగంలో తీవ్రంగా గాయపడ్డ ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.