12 March, 2026 | 8:51 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ లాభం 32 శాతం వృద్ధి

16-10-2024 12:18 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: హెచ్‌డీఎఫ్‌సీ అసెట్  మేనేజ్ మెంట్ కంపెనీ (ఏఎంసీ) నికరలాభం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 32 శాతం వృద్ధిచెంది రూ. 576 కోట్లకు చేరింది. నిరుడు ఇదేకాలంలో రూ. 436 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. కంపెనీ మొత్తం ఆదాయం రూ. 765 కోట్ల నుంచి రూ. 1,058 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ షేరు 1 శాతం మేర పెరిగి రూ. 4,530 గరిష్ఠస్థాయిని తాకింది.