16-10-2024 12:19:25 AM
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సోలార్ ప్యానల్ తయారీ కంపెనీ వారీ ఎనర్జీస్ రూ.3,600 కోట్ల సమీకరణ కోసం జారీచేస్తున్న ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అక్టోబర్ 21న ప్రారంభమవుతుంది. ఈ ఐపీవోలో రూ.3,000 కోట్ల విలుఐన తాజా ఈక్విటీ షేర్లనే కంపెనీ జారీచేస్తున్నది. మరో రూ.600 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత షేర్‌హోల్డర్లు, ప్రమోటర్లు ఆఫర్ పర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) మార్గంలో విక్రయిస్తారు.
కంపెనీ ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం యాంకర్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ అక్టోబర్ 18న జరుగుతుంది. ఐపీవో అక్టోబర్ 23న ముగుస్తుంది. తాజా ఈక్విటీ జారీచేసిన నిధులతో వారీ ఎనర్జీస్ 6 గిగావాట్ల ఇన్‌గోట్ వాఫెర్, సోలార్ సెల్, సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ ప్లాంటును ఒడిస్సాలో నెలకొల్పుతుంది. ప్రస్తుతం గుజరాత్, ఉత్తరప్రదేశ్‌ల్లో కంపెనీకి ప్లాంట్లు ఉన్నాయి.