calender_icon.png 2 August, 2025 | 11:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సబ్జెక్టులో ఫెయిల్ అయ్యానని జీవితాన్ని ముగించుకున్నాడు..

01-08-2025 11:30:25 PM

ఉరి వేసుకుని యువకుని ఆత్మహత్య..

అదిలాబాద్ (విజయక్రాంతి): పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని మనస్థాపంతో ఓ యువకుడు తన జీవితానికే ముగింపు పలికిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్(CI Sunil Kumar) తెలిపిన వివరాల ప్రకారం... శాంతినగర్ కాలనీకి చెందిన రిత్విక్(17) అనే యువకుడు ఆదిలాబాద్ లోని పాలిటెక్నిక్ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఐతే ఇటీవల ఫస్ట్ ఇయర్ రిజల్ట్ రాగా అందులో ఐదు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. దీంతో మనస్థాపం చెందిన రిత్విక్ జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా మృతిని తండ్రి భూమన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ తెలిపారు.