02-08-2025 08:23:47 AM
చర్ల ,(విజయక్రాంతి): చర్ల మండలం ఏజెన్సీ ప్రాంతం కావడం అడవి రహదారులకు అనుకొని ఇరువైపులా ఉండడంతో వన్నె ప్రాణులు రహదారిపైకి వస్తుంటాయి ఈ క్రమంలో బి ఎస్ రామయ్య నగర్ సుబ్బంపేట గ్రామపంచాయతీ(Subbampeta Gram Panchayat) పరిధిలో అతివేగంతో ప్రయాణిస్తున్న ఇసుక లారీ నక్కను ఢి కోనడం తో నక్క అక్కడి కక్కడే మృతి చెందింది.ఆ కలేబరం రోడ్డు మీదే పడి ఉండడంతో పలు వాహనాలు దానిపై నడపడం తో మొత్తం చింద్రం మైంది దీనిపై ఫారెస్ట్ అధికారులు స్పందించాలని వన్యప్రాణుల సంరక్షణ కు తగు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఇసుక లారీల అతివేగం మూగ జీవుల పాలిటీ శాపంగా మారిందని ప్రజలు వాపోతున్నారు.