calender_icon.png 2 August, 2025 | 11:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగు లక్షల కుట్ల అల్లికలతో ఎమ్మెల్యే చిత్రపటం బహుకరణ

01-08-2025 11:35:16 PM

కాంగ్రెస్ నేత చింతల శంకర్ నేత..

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): నేత కార్మికుల పనితనంతో ఎమ్మెల్యే మదన్మోహన్(MLA Madan Mohan Rao) చిత్రపటాన్ని నాలుగు లక్షల కుట్లతో చక్కని ఎంబ్రాయిడరీ డిజైన్ చేసి ఎమ్మెల్యే మదన్ మోహన్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం రామారెడ్డి మండలంలోని కాలభైరవ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే మదన్మోహన్ కు బహుకరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతల శంకర్ నేత మాట్లాడుతూ, మదన్ మోహన్ చిత్రపటాన్ని తయారు చేయడానికి రెండు రోజుల నాలుగు గంటల సమయం పట్టినట్లు తెలిపారు. తాము ఇలా చిత్రపటాన్ని నాలుగు లక్షల కుట్ల అల్లికలతో తమ చేనేత పనితనాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్ కు చూపించాలని చాలా రోజుల నుంచి తాను అనుకున్నట్లు తెలిపారు.

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జన్మదినం ఉందని తెలుసుకొని తాను తన సతీమణితో కలిసి 52 గంటల సేపు కష్టపడి కుట్లతో ఎమ్మెల్యే చిత్రపటాన్ని అందంగా తీర్చిదిద్దామని తెలిపారు. కళాత్మక అల్లికలతో తయారు చేసి బహుకరించినట్లు ఆయన తెలిపారు, ఎమ్మెల్యే మదన్మోహన్ మంచి మనసు, అందర్నీ ఆదుకునే ఆప్తుడని అన్ని రకాలుగా నియోజకవర్గాన్ని కరోనా సమయంలో ధైర్యంగా ముందుండి నడిపించి కార్యకర్తలకు ప్రజలకు ధైర్యం చెప్పిన మనసున్న మారాజు మదన్మోహన్ అని అన్నారు. యువకుడు, విద్యా వంతుడు ఐన ఎమ్మెల్యే కు మంత్రి పదవి కచ్చితంగా రావాలని కాలభైరవ స్వామికి పూజలు కూడా చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.