కట్ చెప్పినా ఆగకుండా ముద్దులు పెట్టేశాడు
సయాని గుప్తా.. లిప్ లాక్ సీన్ల మాట ఎత్తితే బాలీవుడ్‌లో అందరి కన్నా గుర్తుకొచ్చేది ఈ అమ్మడు పేరే! ఔను, ఎన్నో సినిమాల్లో ఎన్నో రొమాంటిక్ సన్నివేశాల్లో అంతలా నటించిందీ బోల్డ్ బ్యూటీ. చిట్టి పొట్టి డ్రెస్సులు, లిప్ లాక్ సీన్లలో ఆన్ స్క్రీన్‌లో హద్దు మీరడానికి వెనకాడదు. ఆమె చేసిన ‘ఫోర్ మోర్ షాట్స్’ లాంటి వెబ్ సిరీస్‌లో ఎంత రెచ్చిపోయి నటించిందో చూస్తే మీరూ ఈ విషయాన్ని ఒప్పుకోకుండా ఉండలేరు. అయినా ఈ భామకు సరైన గుర్తింపు లభించడంలేదనుకోండి అది వేరు విషయం.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సయాని.. ఇంటిమేట్ సీన్స్ గురించి ప్రస్తావించింది. ‘శృంగారం గురించి నేను ఒక పుస్తకమే రాయగలను. సినిమాల్లో రొమాంటిక్ సీన్లు చెయ్యడం చాలా సులువు. అయితే ఒకసారి మాత్రం నేను ఇలాంటి సన్నివేశంలో పాల్గొన్నప్పుడు నాకు చేదు అనుభవం ఎదురైంది. ఓ షూటింగ్‌లో బోల్డ్ సీన్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ కట్ చెప్పినా అందులో హీరోగా చేసిన నా కోస్టార్ ఆగలేదు. ముద్దులు పెడుతూనే ఉన్నాడు. అతని ప్రవర్తన ఏమాత్రం బాగాలేదు. కొందరు ఈ విషయాన్ని చిన్న విషయంగా తీసుకుంటారు. కానీ అలా చెయ్యడం సమంసజం కాదు కదా. ఇండస్ట్రీలో కొందరు నటీనటుల సేఫ్టీ గురించి అస్సలు పట్టించుకోరు’ అని వివరించింది. సయాని గుప్తా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.






