18 July, 2026 | 8:41 AM

కర్మ సిద్ధాంతాన్ని గుర్తుపెట్టుకోండి!

30-11-2024 12:00 AM

నటి నయనతార తన ఇన్‌స్టాలో తాజాగా చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ‘అబద్ధాలతో ఎదుటివారి జీవితాలను నాశనం చేసేందుకు ప్రయత్నించకండి. అది కూడా అప్పుతో సమానమే. ఏదో ఒకరోజు మీకు సైతం అంతకు మించి వడ్డీతో సహా తిరిగి వస్తుంది. ఈ విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోండి.. కర్మ సిద్ధాంతం’ అంటూ ఓ నోట్ షేర్ చేసింది. అయితే నయన్ ఎవరి గురించి ప్రస్తావించకుండానే ఈ పోస్ట్ చేసింది. దీంతో ఆమె ఈ పోస్ట్ ధనుష్ ను ఉద్దేశిస్తూ చేసిందంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.

‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ పేరుతో ఆమె ఓ డాక్యూమెంటరీని నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేస్తోంది. ఇందులో ధనుష్ నిర్మించిన ‘నానుమ్ రౌడీ’ సినిమాలోని ఓ క్లిప్ ఉపయోగించడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. వీడియో క్లిప్‌నకు పరిహారంగా రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ ధనుష్ నయనతారకు లీగల్ నోటీసులు పంపించారు. దీనిపై నయన్ వివరణ ఇవ్వాల్సిందే అని కోర్టు కూడా ఆదేశించింది.