24-01-2026 12:00:00 AM
తన ఆస్తులు పెంచుకోవటమే కానీ ప్రజలకు చేసిందేమీ లేదు
కోట్లు పెట్టు... పదవి పట్టు
ఐదేళ్లలో మీరు అభివృద్ధి చేసింది ఏది అమాత్య
నారాయణపేట. జనవరి 23 (విజయక్రాంతి): నారాయణపేట జిల్లా కేంద్రంలో తాజా మాజీ వైస్ చైర్మన్ గతంలో బిఆర్ ఎస్ నుండి కౌన్సిలర్ పోటీ చేసి డబ్బుతో గెలుపొంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ మద్దతుతో వైస్ చైర్మన్ పదవి దక్కించుకొనిఐదు సంవత్సరాలలో తను ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు కు కనీసం ప్రజలకు అందుబా టులో లేకపోవడంతో పాటు వార్డు అభివృద్ధికి పాటు పడకుండా, ఆయన అమెరికా, దేశ వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ తను ప్రా తినిధ్యం వహించిన వార్డు ప్రజలకు అందుబాటులో ఉండకుండా తను చేస్తున్న వ్యాపా రాల అభివృద్ధి కోసం పాటు పడుతూ తన స్వంత అభివృద్ధి కోసం మాత్రమే రాజకీయాల్లోకి రావడం తన స్వంత ఆస్తులు కాపాడుకోవటం కోసమే పదవులు తెచ్చుకోవటం అలవాటుగా మారిందని ప్రజలు విమర్శలు సైతం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఆయన గత ఎమ్మెల్యే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీనీ వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాలకే మచ్చ తెచ్చిన నాయకుడిగా మిగిలిన చరిత్ర ఆయనది. సంఘసేవ ముసుగులో వ్యాపారాలు చక్కబెట్టుకోవటంలో దిట్టగా పేరు గాంచిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకులు మాత్రంగా చెప్పవచ్చు ప్రజలకు మాత్రం చేసిందేమి లేదని ఆ వార్డు ప్రజలు విమర్శలు సైతం చేస్తున్నారు.
ఆయన వ్యాపారాల ముసుగులో వందల కోట్ల ఆస్తులు కాపాడుకోవటంలో మాత్రం తెలివిగా రాజకీయాలను వంట బట్టించుకొన్న రాజకీయ నాయకుడాయాన, ఈ నేపథ్యంలో ఆయన బంగారు నగల వ్యాపారం చేస్తూ తన స్వంత ఆస్తులు సంపాదించుకోవడం తప్ప తాజాగా మాజీ వైస్ చైర్మన్ గా ఉండి అభివ్రుద్ది చేయని వ్యక్తి ఇప్పుడు ఆయన సతీమణి ని చైర్ పర్సన్ గా పోటీచేయించి ప్రజలకు మాత్రం సేవ చేయడానికి సమయం కేటాయించనీ ఆయన సతీమణి ఏమాత్రం పట్టణ ప్రజలకు మాత్రం సేవ చేయదని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. రాజకీయ పదవులను డబ్బులు పెట్టీ కొనటంతో పాటు ఆయన స్వంత ఆస్తులు సంపాదించుకోవడం తప్ప ప్రజలకు ఒరగబెట్టేదేమి లేదని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు